
Hyderabad, Apr 29: శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. విమానాశ్రయం ప్రహరీ గోడ దూకి చిరుత లోపలి భాగంలోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మొదట అడవి పిల్లిగా భావించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం దాన్ని చిరుతగా నిర్ధారించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్‌జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు.
