Cockroach Found in Meal on Train: వందేభారత్ రైలు భోజనంలో చచ్చిన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన ప్యాసింజర్, రైల్వే శాఖ రెస్పాన్స్ ఏంటంటే..

వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.

Cockroach Found In Meal Served On Vande Bharat Train (Photo/x/@iamdrkeshari)

Cockroach Found In Meal Served On Vande Bharat Train: వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన రాణి కమలాపతి నుంచి జబల్ పూర్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో షాకయ్యాడు.

సుభేందు కేసరి అనే వ్యక్తి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తూ నాన్ వెజ్ మీల్ ఆర్డర్ పెట్టగా అందులో చనిపోయిన బొద్దింక కనిపించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రయాణికుడు భోజనానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ వెంటనే స్పందించింది. ప్రయాణికుడికి క్షమాపణలు కూడా చెప్పింది. అంతేకాకుండా సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌‌పై భారీ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. ఈ ఘటనపై రైల్వే సేవా స్పందిస్తూ రైల్ మదాద్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now