Orissa High Court: 6 ఏళ్ల బాలికపై దారుణ అత్యాచారం, నిందితుడు రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చిన ఒడిశా హైకోర్టు

రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని.. హత్యాచారం చేసిన ఆ నిందితుడికి ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.

Orissa High Court (photo-Live Law)

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషి మరణశిక్షను ఒరిస్సా హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని.. హత్యాచారం చేసిన ఆ నిందితుడికి ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలో 2014 ఆగస్టు 21న ఓ ఆరేళ్ల చిన్నారి తన అన్నతో కలిసి చాక్లెట్లు కొనుక్కొని వస్తుండగా, కామాంధులు అపహరించి అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో దొరికిన నిందితులకు పొక్సో కోర్టు మరణ శిక్ష విదించగా.. ఒడిశా హైకోర్టు అందులో ఒక నిందితుడు రోజు దేవుడిని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష నుండి జీవిత ఖైదుకు తగ్గించింది. భార్యతో అటువంటి శృంగారం క్రూరత్వమే, భార్యాభర్తల విడాకుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన కేరళ హైకోర్టు

Here's Bar and Bench Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)