SS Rajamouli-David Warner: డేవిడ్ వార్నర్‌తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. షేర్ చేసిన క్రెడ్ యాప్

సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్, రాజమౌళికి సంబంధించిన క్రెడ్ యాప్ యాడ్ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో డేవిడ్ వార్నర్‌కు ఫోన్‌ చేసిన జక్కన్న.. మీ మ్యాచ్‌ టికెట్స్‌ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా.. అని అడిగాడు. దీనికి డేవిడ్ వార్నర్‌ స్పందిస్తూ.. రాజా సార్‌ ఒకవేళ మీరు క్రెడ్‌ CRED UPI (క్రిడిట్‌ కార్డు చెల్లింపుల యాప్‌) కలిగి ఉంటే క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చంటున్నాడు.

David Warner leaves fans in splits as ad with Director SS Rajamouli goes viral

సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్, రాజమౌళికి సంబంధించిన క్రెడ్ యాప్ యాడ్  వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో డేవిడ్ వార్నర్‌కు ఫోన్‌ చేసిన జక్కన్న.. మీ మ్యాచ్‌ టికెట్స్‌ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా.. అని అడిగాడు. దీనికి డేవిడ్ వార్నర్‌ స్పందిస్తూ.. రాజా సార్‌ ఒకవేళ మీరు క్రెడ్‌ CRED UPI (క్రిడిట్‌ కార్డు చెల్లింపుల యాప్‌) కలిగి ఉంటే క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చంటున్నాడు. అయితే తనకు సాధారణ యూపీఐ మాత్రమే ఉంటే అని జక్కన్న అడుగగా.. డిస్కౌంట్‌ కావాలంటే మీరు నాతో సినిమా తీయాలని కోరుతాడు డేవిడ్‌ వార్నర్‌. అతని విజ్ఞప్తి మేరకు వార్నర్‌తో సినిమా మొదలుపెడతాడు జక్కన్న. వార్నర్‌తో జక్కన్న ఓ సీన్‌తోపాటు యాక్షన్‌ పార్టు, సాంగ్‌ షూట్‌ పూర్తి చేస్తాడు. రామ్ చ‌ర‌ణ్ కు గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌క‌టించిన ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీ, ఈ నెల 13న వైభ‌వంగా డాక్ట‌రేట్ ప్ర‌ధానం

అనంతరం మనం ఆస్కార్స్‌లో కలుద్దామని జక్కన్నతో అంటాడు వార్నర్‌. ఇక వార్నర్‌తో సినిమా తీయడంపై విసుగొచ్చిన జక్కన్న.. అతడితో సినిమా చేయడం కంటే అప్‌గ్రేడ్‌ అవడం ఉత్తమమని ఫిక్స్ అవుతాడు. ఇక వార్నర్‌ ఫోన్‌ చేస్తే తాను ఇప్పుడే CRED UPI కి అప్‌గ్రేడ్‌ అయ్యాయని చెప్తాడు. డేవిడ్‌ వార్నర్‌-జక్కన్న స్టైల్‌లో సాగుతున్న నయా యాడ్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది.

 Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement