Cruelty Against Animal in Tamil Nadu: జల్లికట్టు ఎద్దుతో బలవంతంగా బతికున్న కోడిని తినిపించిన యూట్యూబర్.. వ్యూస్ కోసం దారుణం.. తమిళనాడులో ఘటన.. కేసు నమోదు చేసిన పోలీసులు
వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ జల్లికట్టు ఎద్దుకు బతికున్న కోడిని తినిపించాడు. సేలం జిల్లా చిన్నప్పపట్టిలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపిస్తున్న వీడియో ఓ యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు.
Chennai, Jan 20: తమిళనాడు(Tamilnadu)లో దారుణం చోటుచేసుకుంది. వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ (YouTuber) జల్లికట్టు (Jallikattu) ఎద్దుకు బతికున్న కోడిని(Live Rooster) తినిపించాడు. సేలం జిల్లా చిన్నప్పపట్టిలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపిస్తున్న వీడియో ఓ యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపుల్స్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా సంస్థ ప్రెసిడెంట్ అరుణ్ ప్రసన్న ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎద్దు శాకాహారి అని, ఎద్దుతో బతికున్న కోడిని తినిపించడం ఎంతో క్రూరమైన విషయం అని ప్రసన్న పేర్కొన్నారు. ప్రసన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యూట్యూబర్ పైనా, వీడియోలో కనిపిస్తున్న ఇతర వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)