Viral video: నడిరోడ్డుపై అంకుల్ డ్యాన్స్ అదరహో, అతనితో స్టెప్పులు కలిపిన ట్రాఫిక్ పోలీస్, జాను మేరీ జాన్ సాంగ్ కి ఇద్దరూ అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఓ దేశీ అంకుల్ రోడ్డు పైకి వచ్చి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాపులర్ సాంగ్ అయిన ‘జాను మేరీ జాన్’పై అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సదరు వ్యక్తితో కాలు కదిపాడు.
సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఓ దేశీ అంకుల్ రోడ్డు పైకి వచ్చి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాపులర్ సాంగ్ అయిన ‘జాను మేరీ జాన్’పై అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సదరు వ్యక్తితో కాలు కదిపాడు. దీంతో అటుగా వెళ్తున్న జనం వారిద్దరి డ్యాన్స్‌ని చూస్తూ అక్కడే ఉండిపోయారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోకి క్యాప్షన్‌గా.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అద్భుతమైన ఉదాహరణ ఇదేనంటూ రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డ్యాన్స్ షోలకి పంపిస్తే ఫైనల్స్ గ్యారెంటీ అని ఒకరు కామెంట్ చేయగా, సూపర్ డ్యాన్స్ అంకుల్ అంటూ మరోకరు కామెంట్ పెట్టారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)