Trinadha Rao Nakkina: వీడియో ఇదిగో, తిని సైజులు పెంచు అంటూ హీరోయిన్ అన్షు మీద దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్‌ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది.

Director Trinadha Rao Nakkina slammed for ‘disgusting’ comments on Anshu's size at event (Photo-Video Grab)

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్‌ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ హీరోయిన్‌ మజాకాలో హీరోయిన్‌గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్‌ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌ శరీరం గురించి డైరెక్టర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.

తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు నటి అన్షు, తొలి ఈవెంట్‌లోనే ఆమె సైజ్‌పై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిన డైరక్టర్

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ మజాకా (Majaka Movie)లో రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

Director Trinadha Rao Nakkina slammed for ‘disgusting’ comments on Anshu's size at event

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement