Trinadha Rao Nakkina Comments on Actress Anshu

Hyderabad, JAN 13: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మజాకా (Mazaka). డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో సీనియర్ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) కీలకపాత్రలో నటిస్తుండగా.. అతడి జోడిగా ఒకప్పటి హీరోయిన్ అన్షు అంబానీ (Anshu) నటిస్తుంది. మజాకా సినిమాతోనే (Mazaka Movie) తెలుగు సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఆదివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు, టీజర్ లాంచ్ ఈవెంట్ సైతం నిర్వహించింది చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి

Daaku Maharaaj Movie Review: డాకు మహారాజ్ రివ్యూ..బాలయ్య అభిమానులకు పండగలాంటి సినిమా 

అయితే ఈ వేడుకలో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మజాకా మూవీ టీజర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ త్రినాథ రావు మాట్లాడుతూ.. “అన్షు లాంటి హీరోయిన్.. ఎప్పుడో మేము యంగ్ స్టర్ గా ఉన్నప్పుడో ఇంకా చిన్నప్పుడో నాకు గుర్తులేదు. మన్మథుడు సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డాలా ఉంది అనుకునేవాడిని అప్పుడు . ఆ అమ్మాయిని చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఓ రేంజ్ లో ఉండేదయ్యా బాబూ. ఇప్పటికీ అలాగే ఉందా.. ? కొంచం సన్నబడింది” అంటూ హీరోయిన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Trinadha Rao Nakkina Comments on Actress Anshu

 

ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇఫ్పుడు నెట్టింట వైరలవుతుండగా.. డైరెక్టర్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. డైరెక్టర్ మాటలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఒక హీరోయిన్ గురించి డైరెక్టర్ అలా మాట్లాడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.