Hyderabad: తీవ్ర విషాదం, ఈత కొడుతుండగా స్విమ్మింగ్ పూల్‌లో పడిన కరెంట్ తీగ, విద్యుత్ షాక్ కొట్టి 16 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు.సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ లోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు

electric shock Representational Image (File Photo)

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో కరెంటు తీగ పడటంతో కరెంటు షాక్ కొట్టి 16 మందికి గాయాలు అయ్యాయి. నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు.సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ లోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  అయ్యో పాపం, కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ మృతి, 4 గంటలు పాటు స్తంభం మీదనే మృతదేహం

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement