Fire Accidents in Two Trains: ఈ ఉదయం రెండు రైళ్లలో అగ్ని ప్రమాదాలు.. బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో మంటలు.. రెండు బోగీలు దగ్ధం.. తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో కూడా మంటలు
స్టేషన్ లో హాల్ట్ చేసిన ఉదయన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
Bengaluru, Aug 19: బెంగళూరు(Bengaluru)లోని క్రాంతివీర సంగోలి రాయన్న (కేఎస్ఆర్-KSR) రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ లో హాల్ట్ చేసిన ఉదయన్ ఎక్స్ ప్రెస్ (Udayan Express) రైలులో మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ మొత్తం పొగ నిండిపోయి గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమేంటనే విషయంపై విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. అటు తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో కూడా ఈ ఉదయం మహారాష్ట్ర నాగ్ పూర్ దగ్గర ఎస్-2 బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)