Helicopter Crash in Nepal: నేపాల్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం, సువాకోట్ సమీపంలో కుప్పకూలిన విమానం, 5 మంది చైనీయులు మృతి
నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది.
నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా గుర్తించారు. జపాన్‌లో భారీ భూకంపం, స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు కంపించిన భూమి, సునామీ హెచ్చరికలు జారీ వీడియోలు ఇవిగో..
గత నెలలో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలి, 18 మంది మృతి చెందారు. ఇది జరిగిన రెండు వారాల వ్యవధిలోనే తాజా ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాది యతి ఎయిర్ లైన్స్ విమానం పొఖారా విమానాశ్రయం వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 72 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం నేపాల్ చరిత్రలోనే మూడో అతి పెద్ద దుర్ఘటన.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)