Suryakumar Yadav's Catch Controversy: వివాదానికి ఈ వీడియోతో ఫుల్‌స్టాప్, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ లేటెస్ట్ వీడియో ఇదిగో, బౌండరీలైన్‌కు కొద్ది దూరంలో..

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో వివాదాస్పదమైన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌కు సంబంధించి తాజాగా సరికొత్త యాంగిల్‌కు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. క్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ కాలు బౌండరీకి తగిలిందని, అది అసలు అవుటే కాదని చాలామంది వాదించారు. రీప్లేల్లోనూ సూర్య కాలు బౌండరీలైన్‌కు తాకినట్టు అస్పష్టంగా కనిపించింది.

Fresh Video Angle Puts Suryakumar Yadav's Catch Controversy To Rest

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో వివాదాస్పదమైన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌కు సంబంధించి తాజాగా సరికొత్త యాంగిల్‌కు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. క్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ కాలు బౌండరీకి తగిలిందని, అది అసలు అవుటే కాదని చాలామంది వాదించారు. రీప్లేల్లోనూ సూర్య కాలు బౌండరీలైన్‌కు తాకినట్టు అస్పష్టంగా కనిపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో అది ఫెయిర్ క్యాచేనని, అందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేసింది. ఈ వీడియో సూర్యకుమార్ కాలు బౌండరీ లై‌న్‌కు కొద్ది దూరంలో ఉండడం స్పష్టంగా కనిపించింది. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు, వదిలేసి ఉంటే జట్టు నుంచి పీకేసేవాడినంటూ..

ఈ క్యాచ్ పట్టే సమయానికి సౌతాఫ్రికా విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం. డేవిడ్ మిల్లర్ స్ట్రైక్‌లో ఉండడంతో విజయం ఖాయమనే అనుకున్నారంతా. కానీ, హార్దిక్ పాండ్యా వేసిన పుల్‌టాస్‌ను బలంగా బాదిన మిల్లర్ బౌండరీ వద్ద సూర్యకుమార్‌కు దొరికిపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by SportsGully (@sportsgully)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement