Rohit Sharma on Suryakumar Yadav's catch in T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ ని బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఒడిసిపట్టుకున్న సంగతి విదితమే. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. భారత్ మరోసారి ప్రపంచకప్ చేజిక్కుంచుకునేందుకు కారణమైంది. లాంగ్-ఆఫ్‌లో బౌండరీ లైన్ దగ్గర వెంట్రుకవాసిలో క్యాచ్ అందుకున్న ‘మిస్టర్ 360’ బ్యాలెన్స్‌ను నియంత్రించుకోలేక రోప్ అవతలకి వెళ్లాడు. అయితే ఈలోగానే బంతిని గాల్లోకి ఎగరేసి మళ్లీ తిరిగి వచ్చి అందుకున్నాడు. ఇంతటి అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్యపై సహచర ఆటగాళ్లు, భారత అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. బీసీసీఐ నుంచి 125 కోట్ల రూపాయల చెక్కును అందుకున్న టీమిండియా, వాంఖడే స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య కన్నుల పండుగగా టీమిండియా విక్టరీ పరేడ్
తాజాగా మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిన ఈ క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ పట్టలేకపోయుంటే ఏం చేసేవారని ప్రశ్నించగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ఆ క్యాచ్‌ను సూర్య వదిలేసి ఉంటే అతడిని తాను జట్టు నుంచి వదిలేసేవాడినని సరదా వ్యాఖ్యలు చేశాడు. క్యాచ్‌ను బాగానే పట్టినట్టు సూర్య తనతో చెప్పాడని హిట్‌మ్యాన్ వెల్లడించారు.
Here's Video
#WATCH | Mumbai | Team India captain Rohit Sharma speaks in Maharashtra Vidhan Bhavan as Indian men's cricket team members are being felicitated by CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis
(Source: Maharashtra Assembly) pic.twitter.com/I51K2KqgDV
— ANI (@ANI) July 5, 2024
తమ రాష్ట్ర ఆటగాళ్లైన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లను మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేకంగా సత్కరించింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికపై రోహిత్ ఈ సరదా వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వ్యాఖ్యలు విన్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు వేదిక మీద రాజకీయ, క్రీడా ప్రముఖులు, కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు అందరూ నవ్వారు.