Ghaziabad Road Accident: మనుషుల్లో మానవత్వం నిజంగానే చచ్చిపోయింది, ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే పట్టించుకోకుండా పాల కోసం ఎగబడ్డ యూపీ వాసులు

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైవేపై మిల్క్‌ ట్యాంక‌ర్‌ను వెనుక నుంచి వ‌చ్చిన‌ మ‌రో వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ట్యాంక‌ర్‌ డ్రైవర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అయితే, స్థానికులు మానవత్వాన్ని మరిచిపోయారు. వారి కళ్లముందే మృతదేహం ఉన్నా తమకు పట్టనట్లుగా వ్యవహరించారు.

Truck Driver Dies in Tanker Collision, Locals Prioritise Looting Spilled Milk; Disturbing Video Surfaces.jpg

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైవేపై మిల్క్‌ ట్యాంక‌ర్‌ను వెనుక నుంచి వ‌చ్చిన‌ మ‌రో వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ట్యాంక‌ర్‌ డ్రైవర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అయితే, స్థానికులు మానవత్వాన్ని మరిచిపోయారు. వారి కళ్లముందే మృతదేహం ఉన్నా తమకు పట్టనట్లుగా వ్యవహరించారు. మిల్క్‌ ట్యాంకర్ నుంచి లీకైన పాలను బాటిళ్లలో పట్టుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. ఈ ఘటన సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరుపట్ల సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్ర‌మాదంలో చ‌నిపోయిన డ్రైవ‌ర్‌ను ప్రేమ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.  హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొట్టడంతో ఎగిరి అదే కారు అద్దంపై పడ్డ వృద్ధుడు.. 

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now