Solar Powered Airship: ఇంధనం అవసరం లేని సోలార్ ఎయిర్ షిప్.. సున్నా ఉద్గారాలతో 40 వేల కిలోమీటర్లు కేవలం 20 రోజుల్లోనే చుట్టేసి వస్తుంది మరి!
ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్ ఎయిర్ షిప్ ను తయారు చేశారు.
Newdelhi, Oct 1: అసలు ఇంధనం అన్నదే లేకుండా ప్రపంచాన్ని చుట్టేసే వాహనం ఉంటే ఎంత బాగుణ్ణు అన్న ఆలోచనను నిజం చేశారు యూరో శాస్త్రవేత్తలు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్ ఎయిర్ షిప్ ను (Solar Powered Airship) తయారు చేశారు. ఇది భూమధ్యరేఖ చుట్టూ దాదాపు 40 వేల కిలోమీటర్లు కేవలం 20 రోజుల్లో సున్నా ఉద్గారాలతో చుట్టేసి వస్తుంది. 495 అడుగుల పొడవున్న ఈ ఎయిర్ షిప్ (Airship) ఉపరితలం మొత్తం సోలార్ ఫిల్మ్ తో కప్పి ఉంటుంది. సోలార్ ఫిల్మ్ ద్వారా సూర్యరశ్మిని స్వీకరించి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ద్వారా ఎయిర్ షిప్ నడుస్తుంది. అలాగే పగలు తయారు చేసిన అదనపు విద్యుత్ ను హైడ్రోజన్ గా మార్చడంతో రాత్రిపూట కూడా దీని పయనానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ముగ్గురు సిబ్బందితో నడిపే ఈ ఎయిర్‌షిప్ గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాక ఒక కార్గో విమానం కంటే 8-10 రెట్ల సరుకును రవాణా చేయగలదు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)