Newdelhi, Oct 1: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు (Commercial) వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ (LPG cylinder) ధరను భారీగా పెంచింది. కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను గతకొన్ని నెలలుగా 10, 20 రూపాయల మేర తగ్గిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఒక్కసారిగా రూ.200 కుపైగా పెంచింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.209 పెరిగి రూ.1731.50కి చేరింది. ఇక కోల్‌ కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉన్నది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ (Domestic LPG cylinder) ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులేదని కంపెనీలు ప్రకటించాయి.

Telangana Dasara Holidays: తెలంగాణ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి 25 వరకూ దసరా, బతుకమ్మ సెలవులు.. 26న రీఓపెనింగ్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)