Solar Powered Vayve Eva

New Delhi, JAN 18: పర్యావరణ పరిరక్షణ.. పెట్రోల్‌-డీజిల్‌ భారం తగ్గించుకునేందుకు ఆల్టర్నేటివ్ ఫ్యుయల్‌ వాహనాలు.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌ వాహనాల తయారీ మొదలైంది. తాజాగా సోలార్‌ పవర్‌తోనూ నడిచే కారు కూడా వచ్చేసింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో వేవ్‌ మొబిలిటీ (Vayve Mobility) శనివారం సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది. వేవ్‌ ఇవా (Vayve Eva) కారు మూడు వేరియంట్లు – నోవా (Nova), స్టెల్లా (Stella), వెగా (Vega) వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ధర రూ.3.25 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) ఉంటుంది. కారు సబ్‌స్క్రిప్షన్‌లు ప్రారంభం అయ్యాయి. బ్యాటరీ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్‌) ఉంటుంది. అంటే కారు ధర రూ.6 లక్షల వరకూ పలుకుతుందని భావిస్తున్నారు. ఈ ధరలు తొలి 25 వేల మంది కస్టమర్లకు మాత్రమే పరిమితం అని వేవ్‌ (Vayve) తెలిపింది.

Worlds First CNG Scooter From TVS: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్‌ తయారు చేసిన టీవీఎస్‌, ఒక్కసారి ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే 226 కి.మీ మైలేజ్‌ 

తొలుత 2023 ఎక్స్‌పోలోనే వేవ్‌ మొబిలిటీ (Vayve Mobility) తన సౌర విద్యుత్‌ వినియోగ కారు ఇవా (Eva)ను ఆవిష్కరించింది. పట్టణ ప్రాంతాల్లో పర్యటించే వారికి సుస్థిరమైన ట్రావెలింగ్‌ ఆప్షన్‌గా ఈ కారు ఉంటుంది. సింగిల్‌ చార్జింగ్‌తో 250 కి.మీ దూరం ప్రయాణిస్తుందీ కారు. సౌర విద్యుత్‌తో పని చేయడం వల్ల అదనంగా 3,000 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందీ కారు. వేవ్‌ ఇవా కారు హై ఓల్టేజ్‌ పవర్‌ట్రైన్‌ మోటారుతో వస్తోంది. సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సామర్థ్యంతో కేవలం ఐదు నిమిషాల చార్జింగ్‌తో 50 కి.మీ దూరం అదనంగా ప్రయాణించొచ్చు.

New Kia EV6: కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్‌ అయ్యే కార్‌, అంతేకాదు 650 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి లాంచ్‌ చేసిన కియా 

ఇందులో స్మార్ట్‌ ఫోన్‌ ఇంటిగ్రేషన్‌, ఓవర్‌ ది ఎయిర్ (OTA) అప్‌డేట్స్‌, రిమోట్‌ మానిటరింగ్‌, వెహికల్‌ డయాగ్నిసిస్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. ఖర్చులు తగ్గించేలా లైట్‌ వెయిట్‌ డిజైన్‌తో వస్తోందీ కారు. ఎంజీ కామెట్‌ ఈవీ (MG Comet EV)కి వేవ్ ఇవా (Vayve Eva) గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అర్బన్‌ మొబిలిటీ అవసరాలు తీర్చుకోవడానికి ఉపకరిస్తుంది. సగటున ప్రతి రోజూ 35 కి.మీ దూరం ప్రయాణించొచ్చు. మోడర్న్‌ ఫ్యామిలీకి కోసం ఇన్నోవేషన్‌తో రూపొందించిన అర్బన్ వెహికల్‌ ఇది అని వేవ్ మొబిలిటీ సీఈఓ కం కో ఫౌండర్ నీలేశ్‌ బజాజ్‌ చెప్పారు.