Train Viral Video: వృద్ధుడి మీద నుంచి వెళ్లిన రైలు.. అయినప్పటికీ, అతనికి ఏమీ కాలేదు.. ఎందుకు? ఇదిగో వైరల్ వీడియో
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు ఏమైందంటే??
Gaya, June 19: బీహార్ (Bihar) లో ఓ వృద్ధుడు తన పైనుంచి రైలు (Train) వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో (Video) వైరల్ (Viral) గా మారింది. అసలు ఏమైందంటే?? గయా (Gaya) జిల్లా ఫతేపుర్ మండలంలోని మోర్‌హే గ్రామానికి చెందిన బాలో యాదవ్ (70) పహాడ్‌పుర్ రైల్వేస్టేషనులో పట్టాలు దాటబోయాడు. ఇంతలో స్టేషనులో నిలిచి ఉన్న గూడ్స్ రైలు అకస్మాత్తుగా కదిలింది. దీన్ని గమనించిన ప్రయాణికులు పట్టాలపై పడుకోమని వృద్ధుడికి వినిపించేలా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన బాలో యాదవ్ ఏమాత్రం తడబాటు లేకుండా పట్టాలపై పడుకున్నాడు. రైలు వెళ్లిపోయేదాకా అలాగే ఉన్నాడు. అనంతరం కర్ర సహాయంతో లేచి ఏమీ జరగనట్లు వెళ్లిపోయాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)