Goods Train Passes Over Woman Video: వీడియో ఇదిగో, స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయిన మహిళ, వెంటనే పట్టాలపైకి దూసుకువచ్చిన గూడ్స్ రైలు
వెంటనే ఆ పట్టాలపైకి గూడ్స్ రైలు వచ్చింది. స్థానికులు కదలకుండా అలాగే ఉండమని చెప్పడంతో సదరు మహిళ పట్టాల మధ్యలో అలాగే పడుకుంది
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఓ మహిళ స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయింది. వెంటనే ఆ పట్టాలపైకి గూడ్స్ రైలు వచ్చింది. స్థానికులు కదలకుండా అలాగే ఉండమని చెప్పడంతో సదరు మహిళ పట్టాల మధ్యలో అలాగే పడుకుంది. దీంతో గూడ్స్ రైలు ఆమె మీదుగా వెళ్లింది. కానీ ఆమె సరిగ్గా పట్టాల మధ్యలో పడుకోవడంతో రైలు మీది నుంచి పోయినప్పటికీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు వెళ్లాక పట్టాల మీద ఉన్న సదరు మహిళను స్థానికులు బయటికి తీసుకొచ్చి రక్షించారు.దీనికి సంబంధించిన 32 సెకన్ల వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)