Himachal Pradesh: వీడియో ఇదిగో, పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడిన కారు,మహిళకు తీవ్ర గాయాలు
కారును మహిళ పార్క్ చేస్తుండగా అది అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారును మహిళ పార్క్ చేస్తుండగా అది అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం ఉదయం కారు నడుపుతున్న మహిళ పార్కింగ్ కోసం ప్రయత్నించింది. రివర్స్ చేస్తుండగా ఆ కారు అదుపుతప్పింది. దిగువన ఉన్న 30 మీటర్ల లోతైన గుంతలో పడింది. బోల్తా పడిన కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది.స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, హోండా అమేజ్ కారు గుద్దితే విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన థార్ వాహనం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలిక
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)