Court Orders about Wife Maintenance: ఆదాయం లేకున్నా భర్త భరణం ఇవ్వాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ఆదాయం లేకున్నా, విడాకులు తీసుకున్న భార్యకు ప్రతి నెలా భరణం చెల్లించడం భర్త విద్యుక్త ధర్మం అని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.

Sedition Law | Representational Image (Photo Credits: Pexels)

Newdelhi, Jan 27: ఆదాయం (Income) లేకున్నా, విడాకులు (Divorce) తీసుకున్న భార్యకు ప్రతి నెలా భరణం చెల్లించడం భర్త విద్యుక్త ధర్మం అని అలహాబాద్ హైకోర్టు (Allahabad High court) తీర్పు చెప్పింది. అందుకోసం అన్‌ స్కిల్డ్ లేబర్‌ గా పని చేసి రోజూ రూ.300-400 సంపాదించొచ్చునని మెట్టికాయలు వేసింది. విడాకులు తీసుకున్న తన భార్యకు ప్రతి నెలా భరణం చెల్లించడానికి తనకు ఆదాయం లేదని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఓ వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో సవరణ పిటిషన్ వేశారు. ఆ వ్యక్తి పిటిషన్‌ ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించింది.

Roja from Ongole Loksabha Constituency: ఒంగోలు లోక్‌ సభ బరిలో మంత్రి రోజా? ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కుదరదన్న వైసీపీ అధిష్ఠానం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)