Mana Yatri App: హైదరాబాద్ లో కమీషన్ రహిత తొలి ఆటోక్యాబ్ యాప్ 'మనయాత్రి' అందుబాటులోకి.. డ్రైవరన్నలకు ఎంతో ఉపయుక్తం..
బెంగళూరులో ఇప్పటికే విజయవంతమైన ‘నమ్మయాత్ర’ సాధించిన స్ఫూర్తితో దీన్ని టీ-హబ్‌లో రూపొందించారు.
Hyderabad, Mar 1: హైదరాబాద్ (Hyderabad) లో తొలిసారిగా జీరో కమీషన్ (Zero Commission) ఆధారిత ఆటో క్యాబ్ యాప్ ‘మనయాత్రి’ (Mana Yatri App) తాజాగా అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఇప్పటికే విజయవంతమైన ‘నమ్మయాత్ర’ సాధించిన స్ఫూర్తితో దీన్ని టీ-హబ్‌లో రూపొందించారు. డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం, కమీషన్ల చెల్లింపు లేకుండా పూర్తిగా డబ్బులు డ్రైవరన్న జేబులోకే వెళ్లేలా చేయడం, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పటికే, ఈ యాప్ లో 25 వేల మంది డ్రైవర్లు రిజిస్టర్ అయినట్టు సమాచారం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)