KTR's Challenge to CM Revanth Reddy (photo-File Image)

Hyd, Feb 29: తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని BRS పార్టీకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరిన నేపథ్యంలో...కేటీఆర్ స్పందించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో పోటీ చేద్దాం అంటూ సవాల్ విసిరారు. సేఫ్ గేమ్ వద్దు... డైరెక్ట్ ఫైట్ చేద్దామని అది కూడా నీ సిట్టింగ్ స్థానం మల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందామన్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇలా సవాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు.  బీఆర్ఎస్ పార్టీకి షాక్, బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు మావేనని తెలిపిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్

కొడంగ‌ల్ అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌వాల్ చేసి పారిపోయారన్నారు. స‌వాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాట‌కు విలువ ఏముంటుంది? త‌న‌ది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీది ఏ కోటా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా.. డ‌బ్బులిచ్చి ప‌ద‌వి తెచ్చుకున్నారని ఆరోపించారు.

పేమెంట్ కోటా కాబ‌ట్టే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పేమెంట్ చేయాలన్నారు. బిల్డ‌ర్లు, వ్యాపారుల‌ను బెదిరించి ఢిల్లీకి రేవంత్ క‌ప్పం కట్టాలన్నారు. ఆయన విధించే సెస్‌పై త్వ‌ర‌లో బిల్డ‌ర్లు, వ్యాపారులు రోడ్డెక్కుతారన్నారు. రేవంత్ రెడ్డి తన శక్తిసామర్థ్యాలను ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మగాడైతే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బట్టలు లేకుండా పిల్లాడు అటూ ఇటూ తిరుగుతున్న వీడియో షేర్ చేసిన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని హితవు పలికారు.ఆయనకు తానే సీఎం అన్న నమ్మకం లేదా? మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. పాలనలో అన్నీ సీఎం, మంత్రులకు తెలియాలని లేదు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి’’ అని చెప్పారు.

Here's BRS Party Tweets

బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం మేడిగడ్డ పర్యటనకు వెళుతుందని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద పర్యటిస్తామన్నారు. రోజుకు 5వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు. నీటి పారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకు వెళతామన్నారు.మాకు(బీఆర్‌ఎస్‌)కు సెన్స్‌ లేదని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారని.. మరి సెన్స్‌ ఉండి నీళ్లు వృధా పోతుంటే కాంగ్రెస్‌ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

మొన్న ప్రభుత్వానికి ఇచ్చింది రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ మాత్రమే. మేం డ్యాం సందర్శనకు వెళ్తున్నామని.. వాళ్లు వెళ్తామంటున్నారు. సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఈ పోటీ యాత్రలు మానుకోవాలి. మమ్మల్ని బద్నాం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికైనా ఒక పంప్ ఆన్ చేసి నీళ్ళు వదలండి. కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డికి బరాబర్ చూసి రండి. ఏనుగు వెళ్తే, ఎలుక చిక్కినట్టు ఉంది. ఉద్దండ పూర్ కట్టిందే కేసీఆర్‌. కేసీఆర్ ను బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. రాజకీయం కోసం కేసిఆర్ మీద, గత ప్రభుత్వ పెద్దల మీద కేసులు పెట్టేలా చూస్తున్నారు.

.. కోర్టులు ఉన్నాయి, దైర్యంగా ఎదుర్కొంటాం. బ్యారేజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. నీళ్ళు లీక్ అయ్యే దగ్గర కాపర్ డ్యాం ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వొచ్చు. వెదిరే శ్రీరామ్ తెలివి తక్కువ వాడు, ఎంపి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. అందుకే ఈ విమర్శలు. కాళేశ్వరంకు 400 అనుమతులు ఉన్నాయని అన్నారు.