లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తన ఎక్స్ లో సంచలన వీడియోను షేర్ చేశారు. బట్టలు లేకుండా అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్‌ చేస్తూ దానికి వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్ ఇచ్చారు . దీంతో, బీజేపీ రాజకీయాలపైనే ఆయన ఇలా సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారనే ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోను ప్రధాని మోదీ, అమిత్‌ షా, సునీల్‌ బన్సల్‌, తరుణ్‌చుగ్‌, జేపీ నడ్డా, శివప్రకాశ్‌కు ట్యాగ్‌ చేశారు. గతంలో దున్నపోతులను వాహనంలో ఎక్కించి కొట్టే వీడియోను జితేందర్ రెడ్డి షేర్‌ చేయడంతో బీజేపీలో పెను దుమారమే చోటుచేసుకున్న సంగతి విదితమే. ఇదిలాఉంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌ ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)