Jaipur Viral: గుడి వద్ద రూ.10 వేల ఖరీదైన షూస్ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయమూర్తి

రాజస్థాన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఆళ్వార్‌ కు చెందిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగ్రవాల్ ఈ నెల 20న తన కుటుంబంతో కలిసి జైపూర్‌ లోని బ్రజ్‌నిధి దేవాలయానికి వెళ్లారు.

Sedition Law | Representational Image (Photo Credits: Pexels)

Jaipur, Aug 28: దేవాలయం (Temple) మెట్ల వద్ద విడిచిన ఖరీదైన బూట్లు (Shoes) చోరీ కావడంతో ఓ న్యాయమూర్తి (Judge) పోలీసులను (Police) ఆశ్రయించారు. రాజస్థాన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఆళ్వార్‌ కు చెందిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగ్రవాల్ ఈ నెల 20న తన కుటుంబంతో కలిసి జైపూర్‌ (Jaipur) లోని బ్రజ్‌నిధి దేవాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు తన పది వేల రూపాయల రీబాక్ బూట్లను (Reebok Shoes) గుడి మెట్ల వద్ద విడిచి లోపలికి వెళ్లాడు. ఆ తరువాత బయటకు వచ్చి చూస్తే షూస్ కనిపించలేదు. దీంతో, న్యాయమూర్తి  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. అధికారుల ప్రయత్నాలకు ఎట్టకేలకు దక్కిన ఫలితం.. ఇప్పటివరకూ నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)