JCB Runs On Railway Tracks: రైల్వే ట్రాక్ పై జేసీబీ పరుగులు.. వీడియో వైరల్
అదుపు తప్పకుండా రైలు పట్టాలపై వెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Newdelhi, Oct 22: ఒక భారీ జేసీబీ (JCB) రైల్వే ట్రాక్ పై (Railway Track) పరుగులు తీసింది. అదుపు తప్పకుండా రైలు పట్టాలపై వెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యింది. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో ఈ సంఘటన జరిగింది. లునీ రైల్వే జంక్షన్ వద్ద ట్రాక్ లెవల్ పెంచేందుకు, రైల్వే లైన్ మార్చేందుకు జేసీబీని వినియోగించారు. ఈ సందర్భంగా రైలు పట్టాలపై వెళ్లేందుకు రైల్వే అధికారులు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్ వద్ద ఉన్న రైలు పట్టాలపై జేసీబీ పరుగులుతీసింది. డ్రైవర్ బ్యాలెన్స్ కోల్పోకుండా రైల్వే ట్రాక్ పై జేసీబీని నడపడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)