Jio Network Down? జియో నెట్‌వర్క్ డౌన్, గంట వ్యవధిలోనే 10 వేల ఫిర్యాదులు, కంపెనీ నుంచి ఇంకా రాని ప్రకటన
రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం (JIO Down) ఏర్పడింది. నేడు చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌లో సమస్యలు తలెత్తాయి (Jio Service Down). దీంతో యూజర్లు నెట్‌వర్క్ రావట్లేదంటూ (network issues) సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.
రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం (JIO Down) ఏర్పడింది. నేడు చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌లో సమస్యలు తలెత్తాయి (Jio Service Down). దీంతో యూజర్లు నెట్‌వర్క్ రావట్లేదంటూ (network issues) సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ముంబైలో చాలా గంటల పాటు జియో సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు వినియోగదారులు నివేదించారు. గంట వ్యవధిలోనే డౌన్‌డెటెక్టర్ (Downdetector)లో 10 వేల ఫిర్యాదులు వచ్చాయి. అందులో 67 శాతం మంది వినియోగదారులు సిగ్నల్ లేదని ఫిర్యాదు చేయగా.. 20 శాతం మంది మొబైల్ ఇంటర్నెట్ సమస్యలను ఎదుర్కొన్నారు. మరో 14 శాతం మంది జియో ఫైబర్‌లో సమస్యలు నివేదించారు. ఈ సమస్యపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ పెట్టింది పేరు, గ్లోబల్ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని వెల్లడి
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)