Karnataka: కర్ణాటకలో దారుణ ఘటన, మొబైల్ దొంగిలించాడని జాలరిని పడవపై తలకిందులుగా వేలాడదీశారు, కొడుతూ దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..రోజు చేపలు పట్టుకునేందుకు జాలరుల బృందం వెళుతోంది. అయితే వారిలో ఒకరి మొబైల్ పోయింది.
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..రోజు చేపలు పట్టుకునేందుకు జాలరుల బృందం వెళుతోంది. అయితే వారిలో ఒకరి మొబైల్ పోయింది. దాన్ని ఈ బృందంలోని ఒక జాలరి తీశాడని మిగతా వాళ్లు ఆరోపించారు. తనకు ఎటువంటి పాపం తెలియదని, తాను దొంగతనం చేయలేదని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న మిగతా వాళ్లు.. అతన్ని ఒక పడవపై తలకిందులుగా వేలాడగట్టారు. ఆపై కొట్టి దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో వేలాడుతున్న వ్యక్తి, తనదేమీ తప్పులేదంటూ కాళ్లకు కట్టిన తాడును విప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మిగతా సహచరులందరూ అతని చుట్టూ నిలబడి చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులైన ఆరుమందిని అరెస్ట్ చేశామని తెలిపారు.