Carpenter Shark: ఈ చేపను చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే, దీని నోరే 10 అడుగుల రంపంతో ఉంటుంది, కర్ణాటకలో ఉడుపిలో జాలరులకు చిక్కిన కార్పెంటర్ షార్క్

ఉడుపి మల్పె వద్ద అరేబియా సముద్రంలో అపురూపమైన చేప వలలో పడింది. సా ఫిష్‌ (రంపపు చేప)గా దీనిని పిలుస్తారు. 250 కేజీలున్న ఈ కార్పెంటర్ షార్క్ ను ఆదివారం జాలర్లు బోటులో తెచ్చి లారీలో మంగళూరుకు తరలించారు. చేప నోరు 10 అడుగుల పొడవైన రంపంలా ఉంది. దీన్ని ప్రొక్లెయిన్ తో తీసుకువెళ్లారు

Carpenter shark (Photo-Video Grab)

ఉడుపి మల్పె వద్ద అరేబియా సముద్రంలో అపురూపమైన చేప వలలో పడింది. సా ఫిష్‌ (రంపపు చేప)గా దీనిని పిలుస్తారు. 250 కేజీలున్న ఈ కార్పెంటర్ షార్క్ ను ఆదివారం జాలర్లు బోటులో తెచ్చి లారీలో మంగళూరుకు తరలించారు. చేప నోరు 10 అడుగుల పొడవైన రంపంలా ఉంది. దీన్ని ప్రొక్లెయిన్ తో తీసుకువెళ్లారు. దీనిని చూడడానికి స్థానికులు, పర్యటకులు బారులుతీరారు.ఈ జాతి చేపలు అంతరించే దశకు చేరుకున్నాయి.

ట్విట్టర్‌లో పంచుకున్న వీడియోలో, చనిపోయిన రంపపు చేపలను ఓడరేవు నుండి నెమ్మదిగా తరలించినప్పుడు క్రేన్‌పై ఎగురవేసినట్లు చూడవచ్చు. JCB దానిని మల్పే ఫిషింగ్ హార్బర్‌లోని "వేలం ప్రాంతం"కి తీసుకువెళ్లింది, అక్కడ దానిని మంగుళూరు వ్యాపారికి విక్రయించినట్లు ఆరోపిస్తూ, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now