Garlic Fields Monitored Through CCTV: భగ్గుమంటున్న ఎల్లిగడ్డ ధరలు.. కిలో రూ.500కు చేరిన వైనం.. పెరుగుతున్న దొంగతనాలు.. పొలాల్లో సీసీ కెమెరాలు పెడుతున్న మధ్యప్రదేశ్ రైతులు
గత ఏడాది టమాటా ధరలు భారీగా పెరిగితే, ఇప్పుడు ఎల్లిగడ్డల వంతు వచ్చింది. బహిరంగ మార్కెట్ లో కిలో ఎల్లిగడ్డ గడ్డ ధర రూ.500కు పెరిగింది.
Bhopal, Feb 17: గత ఏడాది టమాటా (Tomato) ధరలు భారీగా పెరిగితే, ఇప్పుడు ఎల్లిగడ్డల (Garlic) వంతు వచ్చింది. బహిరంగ మార్కెట్ లో కిలో ఎల్లిగడ్డ గడ్డ ధర రూ.500కు పెరిగింది. దీంతో పంట పొలాల నుంచే వాటిని కొందరు దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం పొలాల్లో సీసీ కెమెరాలు (CCTV) ఏర్పాటు చేసుకుంటున్నారు కొందరు రైతులు. మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లా మోహ్ ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే, సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)