Madhya Pradesh: దేశంలో రైతు రాజ్యం ఎక్కడ ? కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్న తన భూమిని ఇప్పించాలంటూ కలెక్టరేట్‌లో పొర్లుదండాలు పెట్టిన అన్నదాత, వీడియో ఇదిగో..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. తనకున్న కొద్ది భూమిని నకిలీ పత్రాలతో కొందరు కబ్జా చేశారని ఓ రైతు (Farmer) అధికారులను ఆశ్రయించాడు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురై నిరసనగా కలెక్టరేట్‌లో పొర్లుదండాలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video) అవుతోంది.

Land "Taken By Mafia", Farmer Rolls On Floor With Folded Hands in Mandsaur

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. తనకున్న కొద్ది భూమిని నకిలీ పత్రాలతో కొందరు కబ్జా చేశారని ఓ రైతు (Farmer) అధికారులను ఆశ్రయించాడు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురై నిరసనగా కలెక్టరేట్‌లో పొర్లుదండాలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video) అవుతోంది.  బెంగుళూరులో దారుణం, ధోతి ధరించిన రైతును థియేటర్‌లోకి అనుమతించని సెక్యూరిటీ గార్డు, వీడియో ఇదిగో..

మాంద్‌సౌర్‌ ప్రాంతానికి చెందిన రైతు శంకర్‌లాల్‌ పాటిదార్‌కు తన స్వగ్రామంలో 9 బిగాల వ్యవసాయ భూమి ఉంది. అయితే, ఇందులో కొంత భూమిని కలెక్టర్‌ ఆఫీసులో పనిచేసే బాబు దేశ్‌ముఖ్‌ అనే అధికారి అక్రమంగా లాగేసుకున్నారని శంకర్‌లాల్‌ ఆరోపించారు. స్థానిక మాఫియా, గూండాల సాయంతో బలవంతంగా తమ భూమిని దేశ్‌ముఖ్‌ 2010లో తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిపారు.

Here's Video

అసలైన ధ్రువపత్రాలతో ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. మంగళవారం కూడా మరోసారి కలెక్టర్‌ ఆఫీసుకు రాగా.. అధికారుల నుంచి స్పందన లభించలేదు. దీంతో చేసేదేం లేక ఆఫీసు ప్రాంగణంలో చేతులు జోడించి.. ఏడుస్తూ పొర్లుదండాలు పెట్టారు. కాగా.. దీనిపై జిల్లా కలెక్టర్ దిలీప్‌ యాదవ్‌ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని, సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now