Delicious Twist in Democracy: ఓటు వేసిన వారికి.. ఉచితంగా పోహా, జిలేబీ పంపిణీ.. ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు మధ్యప్రదేశ్ స్వీట్ షాపు యజమాని చొరవ.. వీడియో వైరల్
ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్ షాపు యజమాని చొరవచూపాడు. ఉదయం వేళ ఓటు వేసిన వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు.
Bhopal, Nov 18: ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్ షాపు యజమాని (Sweetshop Owner) చొరవచూపాడు. ఉదయం వేళ ఓటు వేసిన వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. (Madhya Pradesh Assembly Polls) ఈ నేపథ్యంలో ఓటర్లను ఉత్సాహపరిచేందుకు ఇండోర్ కు చెందిన ఒక స్వీట్ షాప్ ఓనర్ ప్రయత్నించాడు. ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకున్న వారికి పోహా (Poha), జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు. వేలిపై సిరా మార్క్ చూపించిన వారికి వీటిని అందజేశాడు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారని కొనియాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)