Madurai Bench on Peternity Leave: ప్రసూతి సమయంలో భార్య పక్కన ఉండేందుకు సెలవులు పెట్టిన సీఐ.. తొలుత మంజూరు చేసి ఆ తర్వాత మెమో ఇచ్చిన ఉన్నతాధికారులు.. కోర్టును ఆశ్రయించిన సీఐ.. భర్తకు సెలవు ఇవ్వాల్సిందేనన్న మధురై ధర్మాసనం
గర్భంతో ఉన్న తన భార్య ప్రసూతి సమయంలో ఆమె పక్కన ఉండేందుకు తనకు 90 రోజులు సెలవులు కావాలంటూ ఇన్‌స్పెక్టర్ శరవణ్ దరఖాస్తు చేసుకున్నారు.
Madurai, Aug 23: భార్య ప్రసూతి సమయంలో (Peternity Leave) భర్తకు సెలవు మంజూరు చేయాల్సిందేనని మద్రాస్ హైకోర్టులోని (Madras Highcourt) మదురై ధర్మాసనం (Madurai Bench) పేర్కొంది. గర్భంతో ఉన్న తన భార్య ప్రసూతి సమయంలో ఆమె పక్కన ఉండేందుకు తనకు 90 రోజులు సెలవులు కావాలంటూ తెన్‌కాశీ జిల్లా కడైయం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శరవణ్ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత సెలవులు మంజూరు చేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత మెమో ఇవ్వడంతో ఆయన మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం ప్రసూతి సమయంలో భార్య బాగోగులను చూసుకోవాల్సిన అవసరం భర్తకు ఉందని, కాబట్టి ఆయన సెలవు దరఖాస్తును పరిశీలించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)