Man Saves Kids: రియల్ హీరో అంటే ఇతనే, భారీ వరదలో చిక్కుకున్న పిల్లల్ని ఫోటోలు తీయకుండా రక్షించిన ఫోటోగ్రాఫర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని ‍అనుకున్నారు. పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

ఒమన్ లో అకస్మాతుగా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు బాలురను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ ఫోటోగ్రాఫర్. ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అయితే అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని ‍అనుకున్నారు. తరువాత పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు. ఒమన్‌లో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిజెన్ అనే మహిళ దీన్ని షేర్ చేయగా.. దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యక్తి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఇతను రియల్ హీరో అంటూ కొనియాడారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)