WhatsApp Banned: భారత్ లో ఆగస్టు నెలలో 74 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. ఎందుకో తెలుసా?
ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు తాజా నివేదికలో సంస్థ పేర్కొన్నది.
Newdelhi, Oct 3: ఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్‌లో 74 లక్షల వాట్సాప్ (Whatsapp) ఖాతాలను బ్యాన్ చేసినట్టు ‘మెటా’ (Meta) వెల్లడించింది. ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు తాజా నివేదికలో సంస్థ పేర్కొన్నది. అసభ్య, అభ్యంతరకర సందేశాలు, వీడియోలు పంపేందుకు ‘వాట్సాప్’ను వాడుతున్నారని, దీనిని అడ్డుకునేందుకు ఖాతాలపై బ్యాన్ విధిస్తున్నట్టు మెటా సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్క ఖాతాదారుడి ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో ఫిర్యాదులకు సంబంధించిన వివరాలుంటాయని, దీని ఆధారంగా చర్యలు చేపట్టినట్టు సంస్థ తెలిపింది.
Siddipet Train: నేటి నుంచి సిద్దిపేట-కాచిగూడ మధ్య రైల్వేసేవలు.. ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు