Apple iPhone (Photo Credits: Twitter)

Newdelhi, Oct 26: స్మార్ట్ ఫోన్ల దిగ్గజం యాపిల్‌ (Apple) కు ఇండోనేషియా (Indonesia) సర్కార్ షాక్ ఇచ్చింది. యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేదం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంలో ఈ ఫోన్ విక్రయాలు, వినియోగంపై ఆంక్షలు పెట్టింది. ఇతర దేశాల్లో కొనుగోలు చేసినప్పటికీ, ఆ ఫోన్లను తమ దేశంలో వాడడంపైనా ఇండోనేషియా నిషేధం విధించింది. ఇండోనేషియాలో యాపిల్ ఐఫోన్ 16 వాడటానికి ఐఎంఈఐ సర్టిఫికేషన్ లేదని వివరించింది. ఒకవేళ ఎవరైనా వాడితే అది అక్రమమే అవుతుందని చెప్పారు.  దీంతో ఇండోనేషియా టూర్ కు వెళ్లాలనుకున్న ఐఫోన్ యూజర్లు షాక్ తిన్నారు.

మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ భీభత్సం.. వీడియో వైరల్

ఎందుకూ ఈ నిర్ణయం?

పెట్టుబడికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రభుత్వం యాపిల్‌ పై ఈ కఠిన నిర్ణయం తీసుకుందని వార్తలు వినబడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. యాపిల్ సంస్థ 1.71 మిలియన్ రూపాయలు (ఇండోనేషియా కరెన్సీ) పెట్టుబడి పెడతామని ఇండోనేషియా ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అయితే 1.48 మిలియన్ రూపాయలు మాత్రమే పెట్టుబడిగా పెట్టిందని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టు రద్దు