whatsapp

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్30 మ‌ధ్య నిబంధ‌న‌లను ఉల్లంఘించిన దాదాపు 71 ల‌క్ష‌ల భార‌త యూజ‌ర్ల‌ను నిషేధించిన‌ట్టు పేర్కొంది. త‌మ ప్లాట్‌ఫాం దుర్వినియోగం నివారించి మెరుగ్గా రూపొందించేందుకు వీలుగా ఈ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు వెల్ల‌డించింది. యూజ‌ర్లు త‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం కొన‌సాగిస్తే మ‌రిన్ని బ్యాన్స్ అమ‌లుచేయ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది.ఏప్రిల్‌లో ఏకంగా 71,82,000 అకౌంట్స్‌ను వాట్పాప్ బ్యాన్ చేసింది. వాట్సాప్‌లోకి కొత్తగా చాట్ లాక్ ఫీచర్‌, యాక్టివేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి

వీటిలో 13,02,000 ఖాతాల‌ను ఎలాంటి ఫిర్యాదులు రాక‌ముందే బ్యాన్ చేయ‌డం విశేషం.త‌మ ప్లాట్‌ఫాం వేదిక‌గా ఇత‌ర యూజ‌ర్ల‌కు ఇబ్బందులు, వేధింపులు ఎదురుకాక‌ముందే అనుమానిత ఖాతాల‌ను గుర్తించి వాటిని వాట్సాప్ బ్యాన్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అకౌంట్ స‌పోర్ట్‌, బ్యాన్ అభ్య‌ర్ధ‌న‌లు, ప్రోడ‌క్ట్ స‌పోర్ట్‌, భ‌ద్ర‌తా ఆందోళ‌న‌ల వంటి వివిధ అంశాల‌పై 10,554 యూజ‌ర్ రిపోర్ట్స్‌ను కంపెనీ స్వీక‌రించింది.