Viral Video: వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. మచిలీపట్నంలో ఘటన.. వీడియో ఇదిగో!

ఈ కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది.

Credits: Twitter

Machilipatnam, July 15: ఆంధ్రప్రదేశ్ లో (Andhrapradesh) పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో (Machilipatnam) ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది. ఆ వరదలోనే అటుగా వెళ్తున్న ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల (Milk Packets) ట్రేలు కిందపడ్డాయి. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకు రావడంతో మొదట ఆశ్చర్యపోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో పాల ప్యాకెట్లను ఏరుకుంటున్న జనాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

Japan Rocket Explode: ఇటు చంద్రయాన్ సక్సెస్.. అటు పేలిపోయిన రాకెట్‌ .. జపాన్ లో పరీక్ష దశలోనే పేలిపోయిన రాకెట్‌ ఇంజిన్ (వీడియోతో)

Alia Bhatt: కిందపడ్డ జర్నలిస్టు చెప్పును చేత్తో తీసిచ్చిన ఆలియా.. నటి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!