Kannappa Movie Update: కన్నప్పలో కంపడుగా ముఖేశ్ రిషి, పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్, రౌద్రం ఉట్టిపడేలా కనిపిస్తున్న ప్రముఖ నటుడు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'కన్నప్ప'లో ముఖేశ్ రిషి కంపడు పాత్రలో నటించనున్నాడు. ఈయన భద్ర గణానికి నాయకుడు. భద్రగణం అంటే పురాతన పుళిందు జాతికి చెందిన ఒక బీభత్సకరమైన తెగ. సదాశివ కొండల్లో నివసించే వీరి లక్ష్యం ఒక్కటే... వంశ పారంపర్యంగా వాయులింగాన్ని పరిరక్షించడం. తాజాగా కన్నప్ప చిత్రం నుంచి 'కంపడు' పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'కన్నప్ప'లో ముఖేశ్ రిషి కంపడు పాత్రలో నటించనున్నాడు. ఈయన భద్ర గణానికి నాయకుడు. భద్రగణం అంటే పురాతన పుళిందు జాతికి చెందిన ఒక బీభత్సకరమైన తెగ. సదాశివ కొండల్లో నివసించే వీరి లక్ష్యం ఒక్కటే... వంశ పారంపర్యంగా వాయులింగాన్ని పరిరక్షించడం. తాజాగా కన్నప్ప చిత్రం నుంచి 'కంపడు' పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తనకు అలవాటైన రీతిలో ముఖేశ్ రిషి రౌద్రం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. అసలు అతడు మగాడే కాదు’.. రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన యువతి.. వీడియో ఇదిగో
పోస్టర్ లో ముఖేశ్ రిషి వెనుకగా బ్రహ్మాజీని చూడొచ్చు. బ్రహ్మాజీ పాత్ర పేరు గవ్వరాజు. కాగా, కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ నెలకొంది. ఈ చిత్రం నుంచి ప్రతి సోమవారం ఒక అప్ డేట్ రిలీజ్ చేస్తున్నారు. కన్నప్ప చిత్రానికి మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)