Mumbai: రెండోసారి, రైలు నుంచి జారిపడిన మహిళ ప్రాణాలను కాపాడిన లేడీ కానిస్టేబుల్ గోల్కర్, అభినందనలతో ముంచెత్తిన అధికారులు, నెటిజన్లు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బైకులా రైల్వేస్టేషన్‌లో లోకల్ రైలు ఎక్కే ప్రయత్నంలో ఓ నలబై ఏళ్ల మహిళ అదుపుతప్పి డోర్‌లో పడిపోయింది. ఆ తర్వాత రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న సందులోకి జారిపోతున్న మహిళను అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ గోల్కర్ గమనించి మెరుపు వేగంతో స్పందించింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బైకులా రైల్వేస్టేషన్‌లో లోకల్ రైలు ఎక్కే ప్రయత్నంలో ఓ నలబై ఏళ్ల మహిళ అదుపుతప్పి డోర్‌లో పడిపోయింది. ఆ తర్వాత రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న సందులోకి జారిపోతున్న మహిళను అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ గోల్కర్ గమనించి మెరుపు వేగంతో స్పందించింది. చిరుతలా పరుగెత్తి బాధితురాలిని ప్లాట్‌ఫామ్‌పైకి లాగేసింది. కాగా, గత రెండు నెలల వ్యవధిలో సదరు మహిళా కానిస్టేబుల్ ఇలాంటి సాహసానికి పూనుకోవడం ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు.
రెండు నెలల క్రితం కూడా ఓ మహిళా ఇలాగే రైలు ఎక్కబోయి పడిపోతుండగా ఆమె చాకచక్యంగా స్పందించి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. కాగా, ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ చూపిన ధైర్యానికి ఉన్నతాధికారులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. మహిళా కానిస్టేబుల్ గోల్కర్ సదరు మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ తెగువపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)