Maharastra Murder: సిగరెట్లు తాగుతున్న యువతులను చూసిన యువకుడి దారుణ హత్య.. మహారాష్ట్రలో ఘోరం
మహారాష్ట్రలో శనివారం దారుణం జరిగింది. నాగ్ పూర్ లోని ఓ పాన్ షాపు వద్ద శనివారం రాత్రి ఇద్దరు యువతులు జయశ్రీ, సవిత సిగరెట్లు కాల్చుతున్నారు.
Nagpur, Apr 9: మహారాష్ట్రలో (Maharastra) శనివారం దారుణం జరిగింది. నాగ్ పూర్ (Nagpur) లోని ఓ పాన్ షాపు వద్ద శనివారం రాత్రి ఇద్దరు యువతులు జయశ్రీ, సవిత సిగరెట్లు కాల్చుతున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన రంజిత్ రాథోడ్ (28) అనే వ్యక్తి ఆ యువతులవైపు తదేకంగా చూశాడు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఇంతలో ఈ యువతుల్లో ఒకరు తన మిత్రుడు ఆకాశ్ కు ఫోన్ చేసి, తక్షణమే రావాలని చెప్పింది. వెంటనే ఆకాశ్ మరికొందరితో కలిసి అక్కడికి వచ్చారు. రాథోడ్ ను కత్తితో అనేకసార్లు పొడిచారు. దీంతో అతను మరణించాడు. జయశ్రీ, సవిత, ఆకాశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)