Daaku Maharaaj Release Trailer: బాలయ్య అరాచకం, ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే, డాకూ మహరాజ్ ట్రైలర్ మాములుగా లేదు..

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'డాకు మ‌హారాజ్' సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్ విడుద‌లైంది.మేకర్స్ రిలీజ్ ట్రైల‌ర్ పేరిట మ‌రో వీడియోను విడుద‌ల చేశారు. బాల‌య్య యాక్ష‌న్‌, బీజీఎం, డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

Daaku Maharaaj Release Trailer:

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'డాకు మ‌హారాజ్' సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్ విడుద‌లైంది.మేకర్స్ రిలీజ్ ట్రైల‌ర్ పేరిట మ‌రో వీడియోను విడుద‌ల చేశారు. బాల‌య్య యాక్ష‌న్‌, బీజీఎం, డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన మొద‌టి ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెంచేసిన చిత్రం యూనిట్‌.. తాజాగా విడుద‌లైన రిలీజ్ ట్రైల‌ర్‌తో మ‌రింత హైప్‌ను క్రియేట్ చేశాయి. కాగా, ఆదివారం నాడు (ఈ నెల 12న‌) ఈ చిత్రం విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది...అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా..ఇక్కడ కింగ్ ఆఫ్ ది జంగల్ ఉన్నాడు, మీరు చూసేయండి

తమన్ మ్యూజిక్‌ అందించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. బాల‌కృష్ణ స‌ర‌స‌న‌ శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వ‌శి రౌతేలా హీరోయిన్లుగా నటించారు. ఇక అనంతపురంలో గురువారం జరగాల్సిన డాకు మ‌హారాజ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తిరుపతి దుర్ఘ‌ట‌న నేప‌థ్యంలో ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. దాంతో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తున్నారు.

Daaku Maharaaj Release Trailer:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement