Nelamangala Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొని కారు మీద పడటంతో ఆరుమంది స్పాట్ డెడ్, నెలమంగళలో విషాదకర ఘటన

బెంగళూరు-తుమకూరు హైవే (NH-48)పై జరిగిన ఘోర ప్రమాదంలో బెంగళూరుకు చెందిన IAST సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రం యెగపాగోల్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 4పై నెలమంగళ తాలూకా తాలెకెరె గ్రామంలో వరుసగా రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. మధ్యలో ఉన్న కారుపై కంటైనర్‌ పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు

Nelamangala accident (Photo Credit: X/@madhuriadnal)

బెంగళూరు-తుమకూరు హైవే (NH-48)పై జరిగిన ఘోర ప్రమాదంలో బెంగళూరుకు చెందిన IAST సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రం యెగపాగోల్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 4పై నెలమంగళ తాలూకా తాలెకెరె గ్రామంలో వరుసగా రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. మధ్యలో ఉన్న కారుపై కంటైనర్‌ పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం కారు నుజ్జునుజ్జుగా మారి ఘటన స్థలం బీభత్సంగా కనిపించింది. ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. వారంతా అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే అథార్టీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కారులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కర్ణాటకలో షాకింగ్ రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి...ట్రక్కు-వోల్వో కారును ఢీకొనడంతో ప్రమాదం

Nelamangala Accident Video: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now