Sonu Sood: నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది సోనూ సూద్, దయచేసి సహాయం చేయాలని నెటిజన్ ట్వీట్, ఆ రక్తంతో నాలాగే మీరు కూడా బ్లడ్ బ్యాంకు ప్రారంభించండని రిప్లయి ఇచ్చిన బాలీవుడ్ నటుడు

సోదరా సోనూసూద్‌ మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి సహాయం చేయండి. ఒక భార్య బాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.

Sonu Sood (photo credit: Instagram)

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ బాలుడికి సోనూ ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీ చేయించారు సోనూ సూద్‌. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సోనూకు తెలియజేస్తూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఆయనకు ట్వీటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజన్ సోనూకు ఫన్నీ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సోదరా సోనూసూద్‌ మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి సహాయం చేయండి. ఒక భార్య బాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సోనూ సూద్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘అది ప్రతీ భార్య జన్మ హక్కు బ్రదర్.. ఆ రక్తంతో నాలాగే మీరు కూడా బ్లడ్ బ్యాంకు ప్రారంభించండి’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement