No Admission Below 16: పదహారేండ్ల లోపు విద్యార్థులను చేర్చుకోవద్దు.. కోచింగ్ సెంటర్లకు కేంద్రం నూతన మార్గదర్శకాలు

పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాల నేపథ్యంలో కోచింగ్ సెంటర్లకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

Representational Image (File Photo)

Newdelhi, Jan 19: పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు (Suicides), అగ్ని ప్రమాదాల (Fire Accidents) నేపథ్యంలో కోచింగ్ సెంటర్లకు (Coaching Centres) కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను కోచింగ్ సెంటర్లు చేర్చుకోకూడదని గైడ్‌ లైన్స్ స్పష్టం చేశాయి. పాఠశాల స్థాయి విద్య పూర్తయిన తర్వాత మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని సూచించాయి. మంచి ర్యాంకులు లేదా మార్కులు వస్తాయని నమ్మించే ప్రయత్నాలు చేయకూడదని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ నూతన మార్గదర్శకాలు సూచించాయి. విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన స్థలం, గాలి, వెలుతురు ఉండేలా చూడాలని.. లేకపోతే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.

Prescribing Antibiotics: ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే యాంటి బయాటిక్స్‌.. ఎందుకు ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నారో వైద్యులు తప్పనిసరిగా మందుల చీటీలో రాయాలి.. యాంటి బయాటిక్స్‌ పై కేంద్రం నిబంధనలు



సంబంధిత వార్తలు