HPV Vaccine: గర్భాశయ క్యాన్సర్ కు ఒక్క డోసు హెచ్ పీవీ టీకాతో చెక్.. వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్‌వో సిఫారసు
రొమ్ము క్యాన్సర్ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న గర్భాశయ క్యాన్సర్ కు హెచ్ పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాతో చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Newdelhi, Jan 26: గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) కు హెచ్ పీవీ (HPV Vaccine) (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) ఒక్క డోసు టీకాతో చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పదేండ్ల వ్యవధిలో దేశంలోని వివిధ దవాఖానల్లో 10-18 ఏండ్ల మధ్య వయసుండి హెచ్ పీవీ టీకా వేసుకొన్న 2,135 మంది బాలికలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం.. బాలికలకు హెచ్‌వీపీ సింగల్ డోస్ టీకా వేయడం వల్ల గర్భాశయ క్యాన్సర్ యొక్క జీవితకాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలింది. అవసరమైన వారికి ఈ టీకాను ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది. కాగా, రొమ్ము క్యాన్సర్ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్ అన్న విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)