Newyork, Jan 5: సిగరెట్, పొగాకు క్యాన్సర్ కు కారణమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే, పొగాకు లాగానే మద్యపానం (Cancer Warnings For Alcoholic Drinks) కూడా క్యాన్సర్ (Cancer) కు కారణమవుతుందట ఈ విషయాన్ని శుక్రవారం అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి ఒక నివేదికలో తెలిపారు. మద్యపానం వల్ల రొమ్ము, కొలొరెక్టల్ (పెద్ద పేగు), అన్నవాహిక, కాలేయ, నోటి, గొంతు, స్వరపేటిక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొన్నది. ధూమపానం వల్ల 19 శాతం క్యాన్సర్ కేసులు, 29 శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని, అధిక శరీర బరువు వల్ల 7.8 శాతం క్యాన్సర్ కేసులు, 6.5 శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ రెండింటి తర్వాతి స్థానంలో మద్యపానం ఉందని, 5.6 క్యాన్సర్ కేసులకు, 4 శాతం క్యాన్సర్ మరణాలకు మద్యపానమే కారణమని వెల్లడించింది.
US Surgeon General Vivek Murthy said alcohol consumption increases the risk of at least seven types of cancer, and that alcoholic drinks should carry a warning about cancer risks on their label https://t.co/z1H6h22MQM pic.twitter.com/h9zM5QjHX9
— Reuters (@Reuters) January 3, 2025
మహిళలకు ఎక్కువ ముప్పు
మద్యపానం చేసే మహిళలకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొన్నది. బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 17 శాతం వాటికి మద్యపానం కారణం కావొచ్చని తెలిపింది. మహిళలు వారానికి కేవలం రెండు డ్రింక్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పురుషుల కంటే వారిలో ఎక్కువగా ఉంటున్నదని వెల్లడించింది. కాగా యూవీ రేడియేషన్ కంటే మద్యం వల్లే క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు నివేదిక తెలిపింది.