Dance of Light: మెలికలు తిరిగిన ఆకాశహార్మ్యం.. చూడముచ్చట గొలిపే కలల సౌధం.. చైనాలో ప్రారంభం

పగటిపూట సూర్యకిరణాల తాకిడి వల్ల ఈ భవంతి మెరుస్తూ కనిపిస్తుందని.. రాత్రిపూట గ్లాస్‌ ప్యానెళ్ల వల్ల కాంతులు వక్రీభవనం, పరావర్తనం చెందుతుంటాయని.. అందుకే దీనికి డ్యాన్స్‌ ఆఫ్‌ లైట్‌ అని పేరు పెట్టినట్లు నిర్మాణ సంస్థ ఏడస్‌ వివరించింది.

Beijing, September 6: పందిరిని చుట్టుకున్న మల్లెతీగలా ఎలా మెలితిరిగి ఉందో చూశారుగా.. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత మెలికలు తిరిగిన ఆకాశహార్మ్యాల్లో ఒకటిగా నిలిచింది. పశ్చిమ చైనాలోని చోంగ్‌క్వింగ్‌ నగరంలో తాజాగా ప్రారంభమైన ఈ టవర్‌ ఎత్తు 590 అడుగులు. ‘డ్యాన్స్‌ ఆఫ్‌ లైట్‌’గా పిలిచే ఈ భవంతి 8.8 డిగ్రీల కోణంలో మెలికలు తిరిగి ఉంది. ఈ తరహాలో నిర్మించిన ఇతర ఆకాశహార్మ్యాలకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ మెలికలు ఈ టవర్‌ సొంతమని నిర్మాణ సంస్థ ఏడస్‌ తెలిపింది. పగటిపూట సూర్యకిరణాల తాకిడి వల్ల ఈ భవంతి మెరుస్తూ కనిపిస్తుందని.. రాత్రిపూట గ్లాస్‌ ప్యానెళ్ల వల్ల కాంతులు వక్రీభవనం, పరావర్తనం చెందుతుంటాయని.. అందుకే దీనికి డ్యాన్స్‌ ఆఫ్‌ లైట్‌ అని పేరు పెట్టినట్లు వివరించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement