Newyork, Jan 3: వరుస ప్రమాదాలు, దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్నది. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో కల్లోలంగా మారిన అమెరికాలో తాజాగా ఓ బిల్డింగ్ మీద ఓ విమానం కూలిపోయింది. (Plane Crash) కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ నగరం (Orange County city) ఫులర్టన్ (Fullerton)లో ఈ ప్రమాదం జరిగింది.
Here's Video:
2 dead and 18 injured in small plane crash through the rooftop of a Fullerton commercial building in Southern California.#California #PlaneCrash pic.twitter.com/90pxxxf1P1
— Versha Singh (@Vershasingh26) January 3, 2025
18 మందికి గాయాలు
ఈ ప్రమాదంలో మరో 18 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమానం కూలిపోయిన వీడియోలు వైరల్ గా మారాయి.