Newdelhi, Sep 19: నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) రెండో రోజు జరగబోతున్నాయి. ఇవి రొటీన్‌కి భిన్నంగా జరగనున్నాయి. ఎందుకంటే.. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సహా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ (New Parliament) భవనంలోకి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొత్త పార్లమెంట్‌లోని కొన్ని ప్రత్యేకతల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఎంపీల ప్రసంగాల కోసం కేటాయించబడిన మైక్రోఫోన్ లకు ఒక ప్రత్యేక సిస్టమ్ ఉందని తెలిసింది. ఎంపీలకు ప్రసంగం కోసం కేటాయించిన సమయం ముగిసిన వెంటనే.. వారి మైక్రోఫోన్స్ ఆఫ్ అయ్యేలా ఆటోమెటెడ్ సిస్టమ్ అమర్చినట్టు తెలుస్తోంది. ఈ ఆటోమెటెడ్ సిస్టమ్‌ను తీసుకురావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. తమ ప్రసంగాలు పూర్తి కాకముందే.. ప్రభుత్వాలు మైక్రోఫోన్‌లను ఆపేసి, తమ గొంతును నొక్కేస్తుందని ప్రతిపక్ష ఎంపీల నుంచి ఆరోపణలు వచ్చాయి.
Historic Move From Old To New Parliament Today: 10 Facts https://t.co/rdWb9AzSPG pic.twitter.com/7mpLnL4muc
— NDTV News feed (@ndtvfeed) September 19, 2023
బయోమెట్రిక్
కేవలం ఇదొక్కటే కాదు. . ఈ కొత్త భవనంలో ఇంకా మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని సమాచారం. సాధారణంగా.. కొందరు సభ్యులు తమ ఆవేశం కోల్పోయినప్పుడు వెల్‌లోకి దూసుకొచ్చి, నిరసనలు తెలుపుతుంటారు. అయితే.. కొత్త భవనంలో అందుకు వీలు లేకుండా బాగా కుదించేశారు. బయోమెట్రిక్ వ్యవస్థని సైతం ఏర్పాటు చేశారు. ఈ కొత్త భవనంలో ఇకపై పేపర్ లెస్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అంటే.. ఇకపై పేపర్ల అవసరం లేకుండా ప్రతీ ఎంపీకి ఒక ప్రత్యేకమైన టాబ్లెట్ కంప్యూటర్ ని ఇస్తారు. ఈ పార్లమెంట్‌లో మరో ఆకర్షణీయ విషయం ఏమిటంటే.. ఆరు ద్వారాలు. వీటికి గజ, అశ్వ, గరుడ, మకర, శార్దూల, హంస అనే పేర్లు కేటాయించారు. వీటి గుమ్మాలు కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
నేటి షెడ్యూల్
- ఉదయం 9.30కి కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీలతో ఫొటో సెషన్ ఉంటుంది. ఎంపీలు ఐడీ కార్డ్స్ ధరిస్తారు. ఇది దాదాపు గంటపాటూ సాగుతుంది.
- ఉదయం 11.30కి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశం ఉంటుంది. ఈ సందర్భంగా... ఎంపీలందరికీ ప్రధానమంత్రి మోదీ.. గిఫ్ట్ బ్యాగ్‌లు ఇస్తున్నారు. ఒక్కో బ్యాగ్‌లో ఒక రాజ్యాంగం బుక్, పార్లమెంట్ పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంప్ ఉండబోతున్నాయి.
- మధ్యాహ్నం 1.15కి లోక్‌సభ సమావేశం జరగనుంది.
- అలాగే మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశం జరగనుంది.
- అలాగే... స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశం మాత్రం పాత పార్లమెంట్ భవనంలోనే జరగనుంది.